అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ రేపు రాష్ట్రానికి రానున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రానికి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ నేతలు, విద్యావేత్తలతో సమావేశమై కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.