అక్షరటుడే, ఇందూరు: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26న ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీలో ప్రజలు, కార్మికులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు, కార్యదర్శి అనిల్, నాయకులు గంగాధర్, రాధా కుమార్, సురేష్, అలీ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.