అక్షరటుడే, బాన్సువాడ: సివిల్ సప్లయ్స్ హమాలీలకు క్వింటాలుకు రూ.29 చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎంఎల్ఎస్ పాయింట్ గోదాం వద్ద సివిల్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నిరవధిక సమ్మె చేపట్టారు. పెంచిన హమాలీ రేట్ల జీవోను విడుదల చేయాలని, పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పుట్టి సాయిలు, గంపల సాయిలు, భూమయ్య, రాపర్తి సాయిలు, రెంజర్ల హనుమాన్లు, ధర్మం సాయిలు తదితరులు పాల్గొన్నారు.