అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాల చెల్లింపులో ఏజెన్సీ నిర్లక్ష్యం సరికాదని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వీఎల్ నర్సింహ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఐదు నెలలుగాకార్మికులకు వేతనాలు చెల్లించకుండా వేధిస్తున్న గణేష్, వీరభద్ర ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బాలరాజు, మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దశరథ్, మున్సిపల్ కార్మికుల జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.