అక్షరటుడే, ఇందూరు: ఏబీవీపీతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, దేశభక్తి అలవడుతా యని అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ అన్నారు. మంగళవారం ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, ఎన్ఆర్సీ అమలు, జాతీయ విలువలు కలిగిన ఎన్ఈపీ -2020 విధానం కోసం ఏబీవీపీ రాజీలేని పోరాటాలు చేసిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా నిలిచిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసిందని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తుందని తెలిపారు. అంతకుముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు నరేశ్, విభాగ్ సంఘటన మంత్రి రాజు సాగర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ, విభాగ్ కన్వీనర్ శశిధర్, జిల్లా కన్వీనర్ సునీల్, సురేందర్ రెడ్డి, నగర అధ్యక్షుడు వెంకటకృష్ణ, స్వామి యాదవ్, జగన్మోహన్ గౌడ్, రాజ్ గణేశ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.