అక్షరటుడే, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య పెళ్లిపీటలెక్కనున్నారు. సినీనటి, మోడల్ శోభిత దూదిపాళ్లతో గురువారం నిశ్చితార్ధం జరిగింది. ఉదయం 9.42 గంటలకు నిశ్చితార్ధం జరిగినట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ‘ఎక్స్’లో షేర్ చేశారు. నాగచైతన్యకు గతంలో సినీనటి సమంతతో వివాహం జరగగా.. 2021లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా.. కొంతకాలంగా నాగచైతన్య, శోభిత రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి.