మూల్యాంకనానికి రాకపోతే చర్యలు తప్పవు

0

అక్షరటుడే ఇందూరు: పదో తరగతి మూల్యాంకన కేంద్రంలో విధులు కేటాయించిన ఉపాధ్యాయులు హాజరుకాకపోతే చర్యలు తప్పవని డీఈవో దుర్గాప్రసాద్‌ హెచ్చరించారు. శుక్రవారం ఉదయం 8 గంటలలోపు రిపోర్ట్‌ చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ వాల్యూయేషన్ కు హాజరుకానిపక్షంలో శాఖపరమైన చర్యలతో పాటు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగిస్తామన్నారు.