అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల సోదాలు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. వ్యాపారుల వద్ద నుంచి అప్పు తీసుకున్న వారికి సంబంధించిన ఆస్తి పత్రాలు, చెక్కులు, ప్రామిసరీ నోట్‌లను సీజ్ చేశారు. పలువురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. తనిఖీల నేపథ్యంలో వడ్డీ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.