అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: ఇందల్వాయి మండలం మేఘ్యానాయక్ తండాకు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన లకావత్ వెంగల్ అనే వ్యక్తిని డిచ్‌పల్లి మండలంలోని సీఎంసీ హాస్పిటల్ సమీపంలో దుండగులు హత్య చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడిని పట్టుకుని విచారణ జరుపుతున్నారు. కాగా హత్యకేసులో నిందితులందరినీ పట్టుకోవాలని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ప్రధాన నిందితుడు బిక్యా ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు.