అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కమిషనరేట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో శుక్రవారం కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. టౌన్ సీఐ నరహరి, రెండో టౌన్ ఎస్సై రామ్ ఆధ్వర్యంలో ఫ్లాగ్‌మార్చ్ చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను దృష్టిలో ఉంచుకుని రెండో పోలీస్ స్టేషన్ పరిధిలో కవాతు నిర్వహించినట్లు నగర సీఐ నరహరి తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు కుతుబుద్దీన్, యాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.