అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: క్రికెట్‌ ఆడుతూ ఉన్నట్టుండి కుప్పకూలి యువకుడు మృతిచెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. గౌతంనగర్‌కు చెందిన విజయ్‌(30) బుధవారం అమ్మ వెంచర్‌లో క్రికెట్‌ ఆడేందుకు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు ఆస్పత్రికి తరలించినా మార్గమధ్యలో మరణించాడు.