అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఆరో టౌన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 12వ డివిజన్‌లోని రంజాని బాబా దర్గా సమీపంలో హసన్(50) అనే వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి హతమార్చారు. సదరు వ్యక్తి దర్గాలో పని చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.