అక్షరటుడే, ఇందూరు: విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 3న తలపెట్టిన బడిబాట కార్యక్రమం వాయిదా పడింది. ఉన్నతాధికారుల సూచన మేరకు వాయిదా వేస్తునట్లు డీఈవో దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమ వివరాలు త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.