అబద్ధపు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్‌

0

అక్షరటుడే, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. బుధవారం దోమకొండలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను విస్మరించిందన్నారు. ఆరు గ్యారెంటీలు, 13 ముఖ్యమైన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపుకోసం కార్యకర్తలు కష్టపడాలన్నారు. మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని.. అందుకోసం కృషి చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా, దాడులకు పాల్పడినా ఊరుకోబోమని హెచ్చరించారు. జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గెలుపు కోసం ప్రతీఒక్కరూ కష్టపడి పని చేయాలని సూచించారు. తనను గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని అనిల్ కుమార్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌, నేతలు గంప శశాంక్‌, చెలిమెల భానుప్రసాద్‌, నిమ్మ నితీశ్‌రెడ్డి, ప్రేమ్‌ కుమార్‌, శారద, రాజమణి తదితరులు పాల్గొన్నారు.