ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ నిరాకరణ

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన చిన్నకుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కవిత ఇటీవల ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత తరపు నాయ్యవాదులు, ఈడీ వాదనలు విన్న కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కవితకు బెయిల్‌ ఇవ్వడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ వాదనలు వినిపించడంతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమెకు బెయిల్‌ను నిరాకరించింది. మరోవైపు సీబీఐ సైతం కవితను విచారించేందుకు ఇటీవల రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.