అక్షరటుడే, బాన్సువాడ: పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. మండలంలోని జక్కల్ దాని తండా ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్, ఎంపీపీ నీరజ, డీఎల్పీవో నాగరాజు, ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంఈవో నాగేశ్వరరావు, ఎంపీవో సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.