అక్షరటుడే, ఆర్మూర్: ప్రధాని మోదీ అంటే నిజాయితీ అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. ఆయనతోనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మోదీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ప్రపంచ దేశాల్లో భారత్కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఆర్మూర్ పట్టణంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో మోదీకి మూడోసారి కూడా అధికారం ఇవ్వాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు తీసుకువచ్చారని, ఆయనను మరోసారి గెలిపించుకుందామన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, కౌన్సిలర్ జీవీ నరసింహారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.