అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ ప్రాంతంలో పరిశ్రమలను స్థాపించి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఎన్‌ఆర్‌ఐలను కోరారు. యూఎస్‌లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ గ్రామాల్లో కనుమరుగైన సాంస్కృతిక సాంప్రదాయాలను పునరుద్ధరించాలన్నారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం ఎన్‌ఆర్‌ఐలు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి లక్కంపల్లి సెజ్‌ను ప్రోత్సహించడంలో పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. అలాగే సెజ్‌తో పాటు ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మండలాల వారీగా కుటీర పరిశ్రమలు, ఇండస్ట్రీల స్థాపనకు కృషిచేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిపించాలని కోరారు.