అక్షరటుడే, కామారెడ్డి: బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డిలో రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. దీక్షలో ఎంపీ బీబీపాటిల్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు అరుణతార, రాష్ట్ర నాయకులు యెండల లక్ష్మీనారాయణ, కామారెడ్డి నియోజవర్గ ఇన్చార్జి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మద్దూరు భూపాల్, కంది మనోజ్ కుమార్ చారి, తిప్పాపురం రవి, నరేందర్ రెడ్డి, జగదీశ్వర్, రవీందర్ రెడ్డి, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు.