అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టానికి తగిన ఫలితం రాబోతుందన్నారు. మండలాధ్యక్షులు, కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాలు, నగరంలో పూర్తిస్థాయిలో పార్టీ గెలుపు కోసం పనిచేశారన్నారు. ప్రజలు ఉత్సాహంగా ఓటేశారని, గతంతో పోలిస్తే పోలింగ్ శాతం కూడా పెరిగిందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ వైపు మొగ్గు చూపారన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.