అక్షరటుడే, ఇందూరు: కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదని బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. శుక్రవారం నగరంలోని వినాయక్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వ్యవసాయానికి కరెంటు ఇవ్వకుండా నీళ్లులేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. దేవుళ్లపై ప్రమాణం వేసుకుంటూ.. కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలన్నారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకునే శక్తి లేదు.. కానీ పసుపు బోర్డు పేరు చెప్పి ఓట్లను దండుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూకిరణ్, నాయకులు సూదం రవిచందర్, ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.