అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: సీఎం రేవంత్‌రెడ్డి అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నా రని.. ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నిజామాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం నగరంలోని గోనెరెడ్డి కల్యాణ మండపంలో ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. రుణమాఫీ దేవుడెరుగు.. రైతుబంధు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కరెంటు ఇవ్వకపోవడంతో నీళ్లులేక పంటలు ఎడుతున్నాయని.. ఐటీ రంగాన్ని ఆగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చారని.. బోర్డు ఎక్కడ పెట్టారని ప్రశ్నించారు. మోదీని చూసి ఓటేస్తే.. సమస్యలు కూడా మోదీని అడగాలా.. అని వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ ను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతూకిరణ్, నాయకులు సిర్ప రాజు, రవిచందర్, ప్రభాకర్‌రెడ్డి, సుజిత్‌సింగ్ ఠాగూర్, సత్యప్రకాశ్,, ధర్మపురి, చింతకాయల రాజు, నాగభూషణం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.