అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: వర్ని తహసీల్దార్ మోతీసింగ్పై సస్పెన్షన్ వేటు పడింది. అనుమతులు లేకుండా వాల్టా ఖాతా నుంచి డబ్బులు డ్రా చేయడంతో సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. మండలాల్లో ఉండే వాల్టా బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే కలెక్టర్, ఆర్డీవో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, మోతీసింగ్ రూ.3.55 లక్షలు ఎటువంటి అనుమతులు లేకుండా ఖాతా నుంచి తీశారు. ఈ నేపథ్యంలోనే ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం తహసీల్దార్‌పై ఫిర్యాదు రావడంతో ఆర్డీవో ద్వారా విచారణ చేయించగా డబ్బులు డ్రా చేసినట్లు తేలడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.