అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: ధాన్యం సేకరణ కేంద్రాల్లో కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. డిచ్పల్లి మండలం యానంపల్లి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ పరిశీలించారు. రైతుల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను లక్ష్యానికి అనుగుణంగా పూర్తిచేయాలని సూచించారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, లారీల్లో లోడ్‌చేసి నిర్దేశిత రైస్‌మిల్లులకు పంపించాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఎస్వో చంద్రప్రకాశ్, సివిల్ సప్లయ్స్ డీఎం జగదీశ్ తదితరులున్నారు.