అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదల సంక్షేమం సాధ్యమని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం నగర శివారులోని గూపన్‌పల్లిలో ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న పార్టీలను ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పేదల సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు.