అక్షరటుడే, ఇందూరు: విద్యాశాఖ నుంచి అనుమతులు ఉన్న పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని డీఈవో దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు సూచించారు. అడ్మిషన్లు తీసుకునే ముందు సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయంలో సమాచారం సేకరించిన తర్వాతే పాఠశాలలో చేర్పించాలన్నారు. ఇప్పటికే అనుమతులు లేని పాఠశాలలను మూసివేయాలని ఎంఈవోలకు ఆదేశాలు ఇచ్చానన్నారు. పాఠశాలల గుర్తింపు సమాచారం డీఈవో కార్యాలయంలో కూడా తెలుసుకోవచ్చని సూచించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా వేసవి శిక్షణ తరగతులు, ప్రవేశాలు, పాఠశాల ఆవరణలో బెల్టులు, యూనిఫాం అమ్మకాలు నిర్వహించవద్దని.. తమ దృష్టికి వస్తే ఎటువంటి నోటీసులు లేకుండానే అనుమతులు రద్దు చేస్తామని డీఈవో హెచ్చరించారు.