అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆగస్టులో ఆరు గ్యారంటీల్లో మిగిలినవన్నీ అమలు చేస్తామని సీఎం అంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. అప్పటి వరకు ఆయన(సీఎంగా రేవంత్ రెడ్డి) ఉంటారో.. ఉండరో..! అని వ్యాఖ్యానించారు. మంగళవారం నగరంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణతో కలిసి స్థానిక విఠలేశ్వర మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. డిసెంబరులోనే హామీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ అన్నారని గుర్తు చేశారు. మరోవైపు రోజురోజుకి రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని, తాజా సర్వేల ప్రకారం 12 సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. అదే జరిగితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిని ఇక శ్రీరాముడే రక్షించాలని పేర్కొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement