అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డి వెళ్లిపోయారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ లక్షకు పైగా మెజారిటీతో ఆధిక్యం కనబరుస్తుండడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజల తీర్పును శిరసా వహిస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేరకు అర్వింద్‌ హామీలను అమలు చేయాలని కోరారు.