అక్షరటుడే, ఇందూరు: కాంగ్రెస్‌కు ఓటేస్తే హిందూ మహిళలు ప్రమాదంలో పడడం ఖాయమని ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. నగరంలోని శ్రీరామ గార్డెన్‌లో శుక్రవారం మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..ట్రిపుల్ తలాక్ బిల్లును తమ ప్రభుత్వం తెస్తే దాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతుందన్నారు. దేశంలో జరిగే ఏ ఎన్నికలకైనా మహిళా ఓటు బ్యాంకు కీలకమని, అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించేది మహిళలేనన్నారు. అర్బన్ నియోజకవర్గంలో మహిళల మద్దతు తనకు పూర్తిస్థాయిలో ఉందన్నారు. అనంతరం పలువురు మహిళలు బీజేపీలో చేరారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక, జగిత్యాల ఇన్‌చార్జి బోగ శ్రావణి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.