అక్షరటుడే, కామారెడ్డి: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. కామారెడ్డి మండలం కొట్టాలపల్లి, నర్సన్నపల్లి గ్రామాల రైతులు పంటలు ఎండిపోతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సన్నపల్లి శివారులోని ట్రాన్స్‌ఫార్మర్ల బిగింపులో అధికారులు అలసత్వం వహించడంతో వరి పొలం ఎండిపోయిందని రైతు బాలయ్య తెలిపారు. పలుమార్లు ట్రాన్స్‌కో ఏఈ, లైన్‌మెన్‌లకు విన్నవించినా నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లముందే పంట ఎండిపోవడంతో తమకు లక్ష రూపాయల వరకు పంట నష్టం జరిగిందని విలపించారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ బిగించాలని రైతులు కోరుతున్నారు.