అక్షరటుడే, ఎల్లారెడ్డి: నాగిరెడ్డిపేట వైస్ ఎంపీపీగా పోచారం ఎంపీటీసీ సభ్యురాలు వినీత రెడ్డి ఎన్నికయ్యారు. ఇటీవల వైస్ ఎంపీపీ రాజదాస్‌పై అవిశ్వాసం నెగ్గిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం నూతన వైస్ ఎంపీపీ కోసం ఎన్నిక నిర్వహించగా.. పోచారం గ్రామానికి చెందిన టేకులపల్లి వినీత రెడ్డికి ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు మద్దతు తెలిపారు. ఆమె వైస్ ఎంపీపీగా ఎన్నికైనట్లు ప్రత్యేకాధికారి వీరస్వామి ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎంపికైన వైస్ ఎంపీపీని జడ్పీటీసీ సభ్యుడు మనోహర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు సన్మానించారు.