అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదాపూర్ లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ బృందం బుధవారం దాడులు చేసింది. ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ పురుషోత్తం సిబ్బంది దాడులు చేసి పేకాడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. జూదరుల నుంచి రూ.10,800 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మాక్లూర్ పోలీసులకు అప్పగించారు. దాడుల్లో సిబ్బంది లక్ష్మన్న, రాములు, అనిల్ కుమార్, నర్సయ్య పాల్గొన్నారు.