కార్పొరేషన్‌ ఛైర్మన్ల నియామక ఉత్తర్వులు జారీ

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రంలో 35 మంది ఛైర్మన్లను నియమిస్తూ మార్చి 15వ తేదీన జీవో విడుదలైన విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో నియామకాలకు బ్రేక్‌ పడింది. తాజాగా నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడడంతో ఉత్కంఠకు తెరపడినట్లయ్యింది. దీంతో కార్పొరేషన్‌ ఛైర్మన్లు మరో రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి కార్పొరేషన్‌ పదవులు దక్కిన విషయం తెలిసిందే.

ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికైన కార్పొరేషన్‌ ఛైర్మన్లు వీరే..

విత్తనాభివృద్ధి సంస్థ – అన్వేష్‌రెడ్డి

ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ – కాసుల బాల్‌రాజు

రాష్ట్ర సహకార సంఘం – మానాల మోహన్‌రెడ్డి

ఖనిజాభివృద్ధి(మినరల్ డెవలప్మెంట్)- ఈరవత్రి అనిల్‌

35 మంది కార్పొరేషన్‌ ఛైర్మన్ల వివరాల కోసం లింకును క్లిక్ చేయండి..