అక్షరటుడే, ఇందూరు: గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు అధ్యాపకులు పీహెచ్ డీ పూర్తిచేసి డాక్టరేట్ పొందారు. తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి రసాయన శాస్త్రంలో తౌఫిక్ అహ్మద్, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి జువాలజీ లో శ్రీనివాస్ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బోటనీలో లత డాక్టరేట్ పొందారు. ఈ సందర్భంగా శుక్రవారం అధ్యాపకుల అసోసియేషన్ ఆధ్వర్యంలో వారిని సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, స్టాఫ్ కో-ఆర్డినేటర్ సతీష్ కుమార్, ఆయా విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.