అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు బయటకు వచ్చే మార్గంలో నిర్మిస్తున్న డ్రెయినేజీ నిర్మాణ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని సీపీఎం నాయకులు శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్యకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేశ్, పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, భువనేశ్వర్, రవి, కుల్దీప్ శర్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.