అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ బల్దియా నూతన చైర్‌పర్సన్‌గా వన్నెల్దేవి లావణ్య బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతకుముందు చైర్పర్సన్ లావణ్యకు కాంగ్రెస్ నేత తాహెర్‌బిన్ హందాన్, ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్‌రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, సాయిబాబా గౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.