అక్షరటుడే, ఆర్మూర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్ పర్సన్ లావణ్య భర్త అయ్యప్ప శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ మురళి, కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు సాయిబాబాగౌడ్‌ ఆధ్వర్యంలో ఆదివారం వివిధ పార్టీల నాయకులు సుమన్‌, కోడిగేల మల్లయ్య, దున్నాల రామాగౌడ్‌, సాయితేజ, సాయిరాజ్‌ కాంగ్రెస్‌లో చేరారు. వారికి వినయ్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి మాజీ సర్పంచ్‌ మారుతి రెడ్డి, ఆర్మూర్‌ సొసైటీ డైరెక్టర్‌ మానేటి లింబాద్రి, కాంగ్రెస్‌ నాయకులు పోచన్న, రింగుల భూషణ్‌, దాసరి అనిల్‌, శేఖర్‌ రెడ్డి, మల్కన్న, బుజ్జి పాల్గొన్నారు.