ఉదయాన్నే దినపత్రిక కోసం ఎదురుచూసే రోజులకు దాదాపు కాలంచెల్లింది. క్షణక్షణం తాజా వార్తలు వీక్షించే సమయం వచ్చింది. దీంతో డిజిటల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యత పెరిగింది. అరచేతిలో వెనువెంటనే విశ్వవ్యాప్త సమాచారాన్ని అందించే వార్తల వైపు ప్రజానీకం మళ్లుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియాదే కానుంది. దీంతో తామరతంపరగా వెబ్ ఎడిషన్లు, వెబ్‌సైట్లు, మీడియా సంస్థలు పుట్టుకొచ్చాయి. కానీ వాటిలో విశ్వసనీయత కలిగిన వాటిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. నేటి సోషల్ మీడియా యుగంలో ప్రతి వార్తను కచ్చితత్వంతో పాటు త్వరితగతిన పాఠకుల చెంతకు చేర్చడం ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో ‘టువర్డ్స్, ట్రూత్, ట్రస్ట్, ట్రెండ్’ అనే నినాదమే శ్వాసగా అక్షర రూపం తొడిగింది ‘అక్షరటుడే’ డిజిటల్ మీడియా. ప్రతి అక్షరం ప్రజాపక్షాన నిలవాలనే ఆకాంక్షతో వెబ్‌సైట్, ఈ`పేపర్‌లతో సరిగ్గా ఏడాది క్రితం మీ ముందుకు వచ్చిన ‘అక్షరటుడే’.. ఈ సంవత్సర కాలంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ.. అంచెలంచెలుగా ఎదుగుతూ లక్షల మంది పాఠకులను సొంతం చేసుకుంది. కేవలం వందల మంది రీడర్ల నుంచి మొదలైన ప్రస్థానం ప్రస్తుతం లక్షల మందికి చేరింది. అందరి ఆదరాభిమానాలతో మరింత ముందుకు సాగుతూ.. అతి త్వరలో ‘అక్షరటుడే`న్యూస్ యాప్’ మీ ముందుకు తెస్తోంది. మీ అందరి అభిమానం ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ.. లక్షల మంది పాఠక దేవుళ్లు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు..
ఇట్లు
మీ అక్షరటుడే యాజమాన్యం