అక్షరటుడే, బోధన్: ఎగువన కురుస్తున్న వర్షాలతో అలీసాగర్ కు భారీగా వరద వస్తోంది. దీంతో సోమవారం(నేడు) ఉదయం 10:30 గంటలకు ప్రాజెక్ట్ వరద గేట్లను ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు. గేట్లను ఎత్తి వాగులోకి నీరు వదులుతామని, వాగు పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.