తెలుగు సినిమాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు

0

అక్షరటుడే, వెబ్ డెస్క్:  తెలుగు సినిమా నిర్మాణంలో దర్శకులు నటీనటులతో సహా ప్రతి ఒక్కరు తమ జీవితాలను పెట్టుబడిగా పెడుతున్నారని, అందుకే మన సినిమాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని అల్లు అర్జున్ పేర్కొన్నారు. హైదరాబాదులోని యూసుఫ్ గూడలో వైల్డ్ ఫైర్ జాతర పేరుతో నిర్వహించిన పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు. ఈ సినిమా కోసం అందరూ మూడేళ్లపాటు తమ జీవితాల్ని ఇందులో పెట్టుబడిగా పెట్టినట్లు బన్నీ పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం తన అభిమానులను మూడు సంవత్సరాలు ఎదురు చూసేలా చేశానని, తాను పడిన ఈ మూడేళ్ల కష్టం తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. మరో సందర్భంలో మాట్లాడుతూ.. కేరళ వారికి తాను అడాప్టర్ సన్ ని అని అన్నారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. బన్నీ మీద ప్రేమతోనే పుష్ప చేశానని చెప్పారు.