అక్షరటుడే, వెబ్ డెస్క్: చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఉదయం 6.35 గంటల ప్రాంతంలో జైలు అధికారులు ఆయన్ను విడుదల చేశారు. కాగా జైలు వెనుక గేటు నుంచి నేరుగా ఆయన ఇంటికి వెళ్లిపోయారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో శుక్రవారమే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాత్రి జైలులోనే ఉండిపోయారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 18 మందిని నిందితులుగా చేర్చగా.. అందులో అల్లు అర్జున్ ఏ11గా ఉన్నారు.