అక్షరటుడే, ఆర్మూర్: వేల్పూరు మండలం అమీనాపూర్ సాయిబాబా ఆలయం వద్ద శుక్రవారం రాత్రి కారు బోల్తాపడి జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన అల్లూరి శ్రావణ్ రెడ్డి(32) మృతి చెందాడు. కుక్కలు అడ్డురాగా వాటిని తప్పించే క్రమంలో పక్కనే ఉన్న చెట్టును ఢీకొని కారు పల్టీలు కొట్టింది. ప్రమాదంలో శ్రావణ్​రెడ్డి మృతి చెందగా అల్లూరి హారిక రెడ్డి, దశరథ్ రెడ్డి గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆర్మూర్​లోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.