అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాలతోనే ప్రారంభమైనా.. కాసేపటికి తర్వాత లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ ఉదయం 188 పాయింట్ల నష్టంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 485 పాయింట్లు పడిపోయింది. అయితే 79వేల పాయింట్ల వద్ద కీలకమైన సపోర్ట్ లభించడంతో తిరిగి పుంజుకుంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 530 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ సైతం ఉదయం 61 పాయింట్ల నష్టంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 144 పాయింట్లు పడిపోయినా.. క్రమంగా కోలుకుంది. 24 వేల పాయింట్ల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల బాట పట్టింది. ప్రస్తుతం 160 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.