అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాలకు చెందిన 1997–98 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులంతా ఒక్కచోట చేరి తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. బాల్యమిత్రులతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముక్కెర విజయ్, మల్లయ్య, పవన్, గంగారెడ్డి, నరేందర్, రామకృష్ణ, రాకేశ్, నారాయణ, చిరంజీవి, గోపి, రణధీర్ శర్మ, మమత, శ్రీలత, రేణుక, వనిత తదితరులు పాల్గొన్నారు.