అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మంచు తుపాన్ దాటికి అమెరికా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ప్రయాణాలు నిలిచిపోయాయి. 63 మిలియన్ల ప్రజలపై తుపాన్ ప్రభావం పడింది. తుపాన్ కారణంగా అమెరికా వాతావరణ అధికారులు కనస్, మిసోరి రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు.