అక్షరటుడే, వెబ్‌డెస్క్: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ప్రమాదం జరిగింది. ట్రెయినీ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. ఈ క్రమంలో ఎయిర్ క్రాఫ్ట్ ముందు చక్రం వంగిపోవడంతో రన్‌వేను చీల్చుకుంటూ వెళ్లింది. ప్రమాదం నుంచి పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనతో రన్‌వే దెబ్బతినగా అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు.