అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ బైపాస్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి రోడ్డుపై ఓ కారు వెళుతుండగా ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలను గుర్తించిన అందులోని ప్రయాణికులు వెంటనే కిందికి దిగి భయంతో దూరంగా పరిగెత్తారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. కర్ణాటక నుంచి ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.