అక్షరటుడే, డిచ్పల్లి: జాతీయ రహదారిపై డిచ్పల్లి సమీపంలో శనివారం అమ్మోనియా యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడింది. కామారెడ్డి వైపు నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో డిచ్పల్లి శివారులోని నాగ్పూర్ గేటు వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ట్యాంకర్ నుంచి లిక్విడ్ బయటికు వస్తుండడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.