అక్షరటుడే, ఇందూరు: రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ సర్వీస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్ల శిబిరాన్ని మంగళవారం బర్కత్ పురాలో ఏర్పాటు చేశారు. శిబిరానికి వచ్చిన సుమారు 50 మంది బాధితుల కొలతలు తీసుకున్నారు. త్వరలోనే వీరందరికీ జైపూర్ కాళ్లను అందజేయనున్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు విజయరావ్, రామకృష్ణ, జ్ఞాన ప్రకాష్, భరత్ పటేల్, జితేంద్ర మలాని తదితరులు పాల్గొన్నారు.