అక్షరటుడే, ఇందూరు: ఫుడ్‌పాయిజన్‌ కారణంగా విద్యార్థిని మృతి చెందడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం కంఠేశ్వర్‌ చౌరస్తావద్ద సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూరు విభాగ్‌ కన్వీనర్‌ కైరి శశి మాట్లాడుతూ వసతిగృహాల్లో, గురుకులాల్లో కనీసవసతుల్లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. ఒకే ఏడాదిలో 51మంది విద్యార్థులు మృతి చెందారన్నారు. వెంటనే ప్రభుత్వం హాస్టళ్లపై ప్రత్యేక నిఘా పెట్టి వారికి శుభ్రమైన భోజనం, వసతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ, ఏబీవీపీ నాయకులు మహేష్‌, రాము, అనిల్‌, విద్యార్థులు పాల్గొన్నారు.